Share News

దేవన్నపేట మోటార్లు ఎందుకు ఆగాయి.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:12 PM

అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు..

దేవన్నపేట మోటార్లు ఎందుకు ఆగాయి..  రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ప్రశ్నల వర్షం
Harish Rao

వరంగల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులపై పగబట్టారా..? అంటూ ఫైర్ అయ్యారు. కనీసం కాలువలు కూడా తవ్వలేకపోయారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో హరీశ్‌రావు ఇవాళ (శుక్రవారం) పర్యటించారు. దేవన్నపేట పంప్‌హౌస్ దగ్గర దేవాదుల మోటార్లని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


మోటార్లు ఎందుకు ఆగాయి..

మోటార్లు ఎందుకు ఆగాయంటూ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు హరీశ్‌రావు. గోదావరిలో నీరు వృథాగా పోతున్నా... దేవన్నపేటలో మూడు మోటార్లు పది రోజులుగా ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో మంత్రులు వచ్చి మోటార్లు ప్రారంభిస్తామని చెప్పి.. చివరకు ప్రారంభించకుండా వెళ్లారని దుయ్యబట్టారు. రైతులపై పగబట్టారా..?, కనీసం కాలువలు కూడా తవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు 60వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. దేవాదుల ప్రాజెక్టులో అతి పొడవైన, లోతైన పంప్ హౌస్ దేవన్నపేట అని తెలిపారు.


బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల థర్డ్ ఫేస్ పూర్తి..

బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల థర్డ్ ఫేస్ పూర్తి చేశామని హరీశ్‌రావు ప్రస్తావించారు. నాడు దేవాదులపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తే... కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పూర్తి చేశారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో దేవాదుల ఆయకట్టును 3లక్షల 17వేల ఎకరాలకు పెంచామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్.. వరంగల్ జిల్లా రైతాంగం నోరుకొడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేవాదులపై రూ.7,300 కోట్లు ఖర్చు చేశామని, 80శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తామని మంత్రులు చెప్పారని... ఇప్పటికీ పైసా పని కూడా చేయలేదని నిలదీశారు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన మంత్రులు ఎక్కడికి పోయారని హరీశ్‌రావు నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 05:55 PM