జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:12 PM
మాజీ సీఎం కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో సహనం కోల్పోయి అధికారమే తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
జనగామ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో సహనం కోల్పోయి.. అధికారమే తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలపై ప్రజలు విసిగిపోయి.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తిరస్కరించారని అన్నారు.
భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ ఒక్కరేనని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ (గురువారం) జనగామలో కడియం శ్రీహరి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఆయనెవరో జాతిపిత అని పేరు పెట్టుకుంటున్నారని.. అందుకు ఆయనకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వారికి వారే జాతిపిత అనుకుంటే సరిపోతుందా.. ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా అని అన్నారు.
జాతిపిత ఎక్కడుంటున్నారు: కడియం శ్రీహరి
‘జాతిపిత ఏడ చదువుకున్నారు.. జాతిపిత ఎక్కడుంటున్నారు.. జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి కదా. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. వేల కోట్ల అక్రమాలకు పాల్పడి, కూలిపోయే కాళేశ్వరం కట్టి.. మీరు చేసిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుంటే తెలంగాణను అవమానపరిచినట్టా..?, తెలంగాణ మీ అయ్యా సొత్తా..?, తెలంగాణ అమరుల త్యాగాలతో సకల జనుల పోరాటంతో ఆవిర్భవించింది. తెలంగాణ నీ అయ్యా జాగీరు కాదు. మీ అహంకారం, అహంభావం వల్లే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటారు. ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలి’ అని కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News