Nara Lokesh: రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:46 AM
విద్య, ఐటీ రంగాల్లో రాయచోటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు..
అమరావతి, జనవరి 9: రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని విద్య, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్‌తో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా విద్య, ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో రాయచోటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రాయచోటిలో విద్యా సంస్థలు, ఐటీ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత శాఖల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. రాయచోటిని భవిష్యత్తులో విద్య, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది: యనమల
ఎస్సీ కార్పొరేషన్ వాహనాల స్థితిపై కమిటీ
Read Latest AP News And Telugu News