vehicle inspection: ఎస్సీ కార్పొరేషన్ వాహనాల స్థితిపై కమిటీ
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:20 AM
ఎస్సీ కార్పొరేషన్ జాతీయ సఫాయి కర్మచారి కార్పొరేషన్ నిధుల నుంచి 2018-19లో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, పవర్ ఆటోల స్థితిని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు....
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఎస్సీ కార్పొరేషన్ జాతీయ సఫాయి కర్మచారి కార్పొరేషన్ నిధుల నుంచి 2018-19లో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, పవర్ ఆటోల స్థితిని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అప్పట్లో 42 హెచ్‌పీ ట్రాక్టర్లను డ్రైన్ల క్లీనింగ్ కోసం కొనుగోలు చేసి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ల ఈడీలకు అప్పగించారు. వాటిని సరఫరా చేసేందుకు ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలపడంతో పలు వాహనాలను పంపిణీ చేయక అవి తుప్పుపట్టిపోయాయి. వాటిని ఏం చేయాలనే దానిపై పరిశీలించేందుకు ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్, ఎస్సీ గురుకులం సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్‌రాజ్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ రంగలక్ష్మి, ఆయా ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, ఆయా జిల్లాల రవాణాశాఖ ప్రతినిధులను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు.