వైసీపీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది: యనమల
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:20 AM
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసిన అంశాన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీ పరిశీలించి...
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసిన అంశాన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీ పరిశీలించి, వెలుగులోకి తీసుకురావడంతో వారి బూటకపు చర్యలు బయటపడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జగన్ అసెంబ్లీ కార్యకలాపాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌కు తెలియకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. ఇది ఆ పార్టీలో అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ చీలికకు దారితీయవచ్చు’ అన్నారు.