Share News

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారమివ్వండి

ABN , Publish Date - Jan 09 , 2026 | 09:38 AM

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారు కచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్‏లో సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ తెలుపుతోంది. ఇంటిలో ఎవరూ లేని సమయాల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాన్నారు. కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలనా పోలీసులు సూచిస్తున్నారు.

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారమివ్వండి

- ప్రతీ ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌, అలారం తప్పనిసరి

- ఏసీపీ రవికిరణ్‌రెడ్డి

కూకట్‌పల్లి(హైదరాబాద్): సంక్రాంతి తెలుగు ప్రజల పెద్దపండుగ అని, ముఖ్యంగా ఆంధ్రకు వెళ్లేవారు కూకట్‌పల్లి, కేపీహెపీ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారని కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి(Kukatpally ACP Ravikiran Reddy) అన్నారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సెలవులకు ఊరు వెళ్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.


city6.2.jpg

వాటికి విద్యుత్‌ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరైతే ఉరికి వెళ్తున్నారో చుట్టు పక్కల వారికి చెప్పాలని, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కూడా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పెట్రోలింగ్‌ చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపామని తెలిపారు. ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌తో పాటు అలారం కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2026 | 09:38 AM