Share News

జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:11 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారని ధ్వజమెత్తారు.

జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
Drugs Awareness Rally

విజయవాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(Gadde Ram Mohan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో గంజాయిని స్కూల్‌ వరకు తీసుకువచ్చారని ఆగ్రహించారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో బుధవారం ర్యాలీ నిర్వహించారు. రామలింగేశ్వర నగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌పై దండయాత్ర ‌పేరుతో ప్రజల్లో అవగాహన తెచ్చేలా‌ కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు.

ram-mahon-3.jpg


డ్రగ్స్‌పై ఉక్కుపాదం..

చంద్రబాబు సీఎంగా‌ బాధ్యతలు స్వీకరించాక.. నేడు ఉన్నతస్థాయిలో డ్రగ్స్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారని తెలిపారు. ఈగల్‌ను ఏర్పాటుచేసి మత్తు పదార్థాల రవాణాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని చెప్పుకొచ్చారు. ఏపీ‌లో ఎక్కడా ‌మత్తు‌ పదార్థాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు అనేది లేకుండా నిర్మూలించారని చెప్పుకొచ్చారు. సమాజం హితం కోసం అధికారులు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో మహిళా‌ కానిస్టేబుళ్లు సైకిల్ యాత్ర చేస్తున్నారని వెల్లడించారు.

ram-mahon.jpg


డ్రగ్స్‌ సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలి..

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. ఇలాంటి అవగాహన యాత్ర ద్వారా ప్రజల్లో ‌మార్పు రావాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ బారిన పడిన‌ వారి వివరాలు తెలిసినా చెప్పాలని పేర్కొన్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తెస్తారని తెలిపారు. ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో జీవితాలు,‌ కుటుంబాలు వీధిన పడుతున్నాయని వెల్లడించారు. పోలీసులు స్వయంగా యాత్రలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించడం మంచి‌ పరిణామమని తెలిపారు.

ram-mahon-4.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 12:27 PM