Kuwait: మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. ఇద్దరు భారతీయులకు మరణశిక్ష..
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:32 PM
ఇద్దరు భారతీయులు డ్రగ్స్ అక్రమ రవాణా చేశారన్న తీవ్రమైన నేరారోపణపై విచారణ జరిపిన కువైట్ లోకల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: కువైట్ చట్టాల ప్రకారం.. డ్రగ్స్ సరఫరా, హత్య, అత్యాచారాల వంటి కేసుల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల కాలంలో డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. విమానాశ్రయాలు, ప్రయాణ సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని తనిఖీలు చేస్తున్నారు. కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు కైఫాన్, షువైఖ్ ప్రాంతాల్లో ఎక్కువగా నిఘా పెట్టారు అధికారులు. పక్కా సమాచారం రావడంతో ఇద్దరు భారతీయులను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఇద్దరి నుంచి 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో వీరికి మరణ శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది అక్కడి కోర్టు. కొంత కాలంగా వీరిద్దరూ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా.. కువైట్ లో పెద్దఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఆరోపణలు రుజువయ్యాయి. కువైట్‌లో మాదకద్రవ్యాలను పూర్తిగా రూపుమాపే క్రమంలో మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వం వాదిస్తోంది.
ఇవీ చదవండి:
లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటుపై జస్టిస్ వర్మ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి! అతడి డబ్బాను చెక్ చేస్తే.. భారీ షాక్