Raghunandan Rao: దేశంలో నకిలీ గాంధీల మాటలు ఎవరు నమ్మరు: రఘునందన్ రావు
ABN , Publish Date - Dec 27 , 2025 | 06:33 PM
బావ, బామ్మర్థులతో అవ్వట్లేదని కేసీఆర్‌ను బయటకు తెచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటికి వచ్చిన తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రభావం ఉండదని విమర్శించారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో నకిలీ గాంధీల మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ పేరు లేకుంటే నకిలీ గాంధీలకు మనుగడ ఉండదని భయపడుతున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీపై సోనియాగాంధీ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే వారి హయంలో గాంధీ పేరుతో ప్రవేశ పెట్టిన పథకాల శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 150 పథకాల్లో రెండు, మూడు పథకాలు మాత్రమే కాంగ్రెస్ గాంధీ పేరు పెట్టిందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగే హింసపై కాంగ్రెస్ కనీసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ (శనివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రఘునందన్ రావు.
ఇదెక్కడి సంస్కృతి..
‘తండ్రి ఈవీఎంలు ప్రవేశపెడితే కొడుకు దాన్ని వ్యతిరేకిస్తాడు. మీరు గెలిస్తే ఈవీఎంలు పని చేస్తున్నట్లా.. మేము గెలిస్తే పని చేయనట్లా?. ఇదెక్కడి సంస్కృతి ? రాహుల్ గాంధీకి తండ్రి అంటే గౌరవం, విశ్వాసం లేదు. ముక్కలైన కాంగ్రెస్.. దేశాన్ని ముక్కలుగా చేయాలని చూస్తోంది. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు , కంప్యూటర్ ఆపరేటర్‌లకు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇంకెవరికి పైసలు ఇవ్వదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రూపాయి అందడం లేదు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా కాంగ్రెస్ చేసింది. గతంలో కాంగ్రెస్ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. మల్లికార్జున ఖర్గే ముందు.. మీ సొంత రాష్ట్రంలో పంచాయతీ చూసుకోండి. అక్కడ రేపు ఎన్నికలు వస్తే ఏమవుతుందో అది చూసుకోండి’ అని రఘునందన్ రావు విమర్శించారు.
కేసీఆర్‌తో ఎలాంటి ప్రభావం ఉండదు..
బావ, బామ్మర్థులతో అవ్వట్లేదని కేసీఆర్‌ను బయటకు తెచ్చారు. కేసీఆర్ బయటకు వచ్చిన తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రభావం ఉండదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి సభలు పెడుతున్నారు. డబ్బులు పెట్టిన జూబ్లీహిల్స్ , కంటోన్మెంట్‌లో ఏమి జరిగిందో అదే అవుతాది తప్ప ఒరిగేదెమీ లేదు. ఇంట్లో పంచాయితీతో బీఆర్ఎస్ ప్రమాదంలో పడింది. అందుకే కేసీఆర్‌ను బయటకు తెచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతో చెప్పిన మాటలు నిజం. మా నాయకుడు మాతో మాట్లాడితే దానికి బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు ఎందుకు..?. మోదీ తమను ఒక్కసారి మజ్లిస్‌తో కంపేర్ చేయడం అనేది వాస్తవం. మా లీడర్ల ఇంట్లో మేము భోజనానికి వెళ్తే తప్ప ?. ఎంపీ అరవింద్ కొత్త ఇల్లు కట్టారని.. భోజనానికి పిలిచారు. అలా ఏదైనా వేడుక ఉంటే అందరం కలుస్తాం’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డ్రగ్స్ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్
Read Latest Telangana News And Telugu News