తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:04 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ (Assembly), శాసనమండలి (Council) రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభ విప్‌ల నియామకం..
అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యేలను ఏకం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్‌లుగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్ ఎమ్మెల్యే), విజయ రమణారావు (పెద్దపల్లి ఎమ్మెల్యే), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే) ఉన్నారు.
శాసనమండలి విప్‌ల నియామకం..
శాసనమండలిలో ప్రభుత్వ పక్షాన సభ్యులను సమన్వయం చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వారిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఉన్నారు. సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు సభ్యులందరూ హాజరయ్యేలా చూడటం వీరి ప్రధాన విధి.
పెరగనున్న ప్రభుత్వ బలం..
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరూ వెళ్లకుండా 'విప్' జారీ చేసే అధికారం వీరికి ఉంటుంది. ఈ నియామకాలతో అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో ప్రభుత్వానికి బలం పెరగనుంది. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఈ ఐదుగురు నేతలు కీలక పాత్ర పోషించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..
హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...
Read Latest Telangana News And AP News And International News And Telugu News