నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..
ABN , Publish Date - Mar 18 , 2026 | 07:50 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27వ తేదీలోగా ఆయనను చంపేస్తామని ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (Raja Singh) ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపు లేఖ రావడం భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో కూడా ఆయనకు పలుమార్లు అంతర్జాతీయ నంబర్ల నుంచి, సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చినప్పటికీ, ఈసారి తేదీని (ఈనెల 27) స్పష్టంగా పేర్కొంటూ లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బెదిరింపు లేఖలో ఏం ఉందంటే..
ఈనెల 27వ తేదీలోగా రాజాసింగ్‌ను చంపేస్తామంటూ ఆగంతకులు ఆ లేఖలో హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల ఆయన చేసిన ప్రసంగాలతోనే ఈ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజాసింగ్ చుట్టూ భారీ భద్రత ఉన్నప్పటికీ, ఇలాంటి లేఖలు రావడం ఆయన అనుచరుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల విచారణ..
ఈ లేఖ అందిన వెంటనే రాజాసింగ్ కార్యాలయ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ నివాసం, ఆయన వెళ్లే ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం
అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అస్తిత్వ శిఖరం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
Read Latest Telangana News And AP News And International News And Telugu News