Share News

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:50 PM

జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...
Jagtial YouTuber Vaishnavi case

జగిత్యాల జిల్లా, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో (Jagtial YouTuber Vaishnavi case) తాజా పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అందరినీ అలరించిన ఓ యువతి, అదనపు కట్నం వేధింపులకు బలి కావడం అత్యంత విచారకరం. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్నారు.


రిమాండ్‌కు తరలింపు..

నిందితుడు హరిబాబు, వైష్ణవిని అదనపు కట్నం కోసమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


కుటుంబ సభ్యులపై దర్యాప్తు..

ఈ హత్య కేవలం హరిబాబు ఒక్కడే చేశాడా..? లేదా కుటుంబ సభ్యుల ప్రోద్బలం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించనున్నాయి. వరకట్న వేధింపులు లాంటి కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్ష పడితేనే, భవిష్యత్తులో ఇటువంటి అకృత్యాలను అరికట్టే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.


ఆడియో కాల్ లీక్..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. అందులో వైష్ణవి హత్యకు ముందు ఆమె అత్తతో మాట్లాడినట్లు తెలుస్తోంది. బెడ్‌రూమ్‌లో ఉంగరం దొంగిలించారని నిందమోపుతూ హరిబాబు తల్లి అభ్యంతరకంగా మాట్లాడినట్లు రికార్డింగ్‌లో ఉంది. తల్లితో ఫోన్ మాట్లాడినప్పుడు వైష్ణవితోనే హరిబాబు ఉన్నారు. ఉంగరం పేరుతో నాటకాలు ఆడవద్దని తన తల్లిని హరిబాబు హెచ్చరించారని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ అస్తిత్వ శిఖరం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 08:37 PM