హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..
ABN , Publish Date - Mar 18 , 2026 | 07:28 PM
హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో దారుణ ఘటన జరిగింది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కారణంతో తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అమానుషంగా ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని బాటాసింగారంలో వెలుగుచూసిన ఈ ఘటన అత్యంత అమానుషం. సొంత అక్కను తమ్ముడే అంతమొందించి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెరువులో పడేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు నీలా, తన భర్త మరణించిన తర్వాత ఒంటరిగా ఉంటోంది. అయితే, ఆమె ప్రవర్తన సరిగా లేదని తమ్ముడు పప్పు రామ్ అనుమానం పెంచుకున్నాడు. అక్క తన తీరు మార్చుకోవాలని హెచ్చరించినా వినలేదనే కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను దారుణంగా హతమార్చాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, స్థానిక మజీదుర్ చెరువులో పడేశాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, గత నెల 28వ తేదీన ఆమె కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదంటూ అతనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి 'మిస్సింగ్' డ్రామా ఆడాడు.
మిస్సింగ్ కేసు నుంచి హత్య వరకు..
తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, నీలా ఫోన్ కాల్ డేటా, ఆమె చివరిగా ఎవరితో ఉందనే విషయాలను సేకరించారు. ఫిర్యాదు చేసిన తమ్ముడు పప్పు రామ్ మాటల్లో పొంతన లేకపోవడాన్ని పోలీసులు గమనించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చెరువులో పడేసిన మృతదేహాల భాగాలను పోలీసులు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం
అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అస్తిత్వ శిఖరం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
Read Latest Telangana News And AP News And International News And Telugu News