Share News

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:45 PM

రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ రూల్స్‌ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు.

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic

హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు.ఈ ట్రాఫిక్ రూల్స్‌ని వాహనదారులు గమనించాలని జాయింట్ కమిషనర్ సూచించారు. మక్కా మసీదు (చార్మినార్) వద్ద రేపు (శుక్రవారం) నిర్వహించే జుమాతుల్ విదా ప్రార్థనల దృష్ట్యా, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


చార్మినార్ జోన్ - మళ్లింపు పాయింట్లు ఇవే..

మదీనా జంక్షన్: నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.

హిమ్మత్‌పురా: నాగులచింత / శాలిబండ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి, వోల్గా హోటల్ (ఖిల్వత్ వైపు) మళ్లిస్తారు.

చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుంచి వచ్చే వాహనాలను కోట్లా అలీజా లేదా మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు.

మోతీగల్లీ: మూసాబౌలి నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లీ వద్ద ఖిల్వత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్ శాలిబండ, ఫతే దర్వాజా రోడ్డు వైపు మళ్లిస్తారు.

ఏతబార్ చౌక్: గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఏతబార్ చౌక్ వద్ద మండి మీరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు.

షేర్ ఏ బాటిల్ కమాన్: మిట్టి కా షేర్ నుంచి గుల్జార్ హౌస్ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని ఘాన్సీ బజార్ మీదుగా హైకోర్టు రోడ్డు / ఖిల్వత్ వైపు మళ్లిస్తారు.

లక్కడ్ కోట (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అవసరాన్ని బట్టి ఏపీఏటీ (APAT) నుంచి వచ్చే వాహనాలను మండి మీరాలం మార్కెట్ వైపు మళ్లిస్తారు.


పార్కింగ్ స్థలాలివే..

గుల్జార్ ఫంక్షన్ హాల్: మదీనా, పత్తర్‌గట్టి నుంచి వచ్చే వారి కోసం.

ముఫీద్ ఉల్ అనామ్ గ్రౌండ్: యాకుత్‌పురా, నూర్ ఖాన్ బజార్, తలాబ్ కట్టా, దబీర్‌పురా నుంచి వచ్చే వారి కోసం.

చార్మినార్ బస్ టెర్మినల్: చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా నుంచి వచ్చే వారి కోసం.

ఏయూ హాస్పిటల్ పార్కింగ్: సంతోశ్‌నగర్, తలాబ్ కట్టా, మొఘల్‌పురా నుంచి వచ్చే వారి కోసం.

ఖిల్వత్ గ్రౌండ్: మిస్రిగంజ్, ఫతే దర్వాజా, హుస్సేనీ ఆలం, పురానాపూల్ నుంచి వచ్చే వారి కోసం.

పాత పెన్షన్ ఆఫీస్ / ఉర్దూ మస్కన్: కిషన్‌బాగ్, బహదూర్‌పురా, హుస్సేనీ ఆలం నుంచి వచ్చే వారి కోసం.

గమనిక: ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. సిటీ బస్సులు అఫ్జల్‌గంజ్ వద్దే నిలిపివేస్తారు. జిల్లా బస్సులు చాదర్‌ఘాట్, సైదాబాద్, మిధాని మీదుగా మళ్లిస్తారు.


సికింద్రాబాద్ జోన్..

సికింద్రాబాద్‌లోని సుభాశ్ రోడ్ (మహంకాళి L&O PS నుంచి ఓల్డ్ రామగోపాల్‌పేట PS వరకు) ఉదయం 9:00గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మూసివేస్తారు. బాటా ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద లాలా టెంపుల్ వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలను చూడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 సంప్రదించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 10:01 PM