Share News

తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధి

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:28 PM

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధి
telangana budget 2026

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

తాము గత పాలకుల వలె కాకుండా, ప్రజల సేవకుల లాగా పని చేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశామన్నారు. గతంలో జరిగిన ఆర్థిక తప్పిదాలను సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని సభకు వివరించారు.

దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ అటు సంక్షేమానికి, ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ రూపొందించామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు గతంలో కంటే మెరుగైన కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


బడ్జెట్ స్వరూపం:

తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు

మూలధన వ్యయం రూ.47,267 కోట్లు

తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు

వృద్ధి రేటు 10.2శాతం

బడ్జెట్ గణాంకాలు, కేటాయింపులు:

రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు

సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు

పశుసంవర్ధక శాఖ - రూ.1,529 కోట్లు

విద్యుత్ - రూ.21,285 కోట్లు

విద్యా శాఖ - రూ.26,674 కోట్లు

వైద్యం - రూ.13,679కోట్లు

కార్మికుల సంక్షేమం - రూ.999 కోట్లు

మహిళా శిశు సంక్షేమం - రూ.3,143 కోట్లు

ఎస్సీ సంక్షేమం - రూ.11,784 కోట్లు

ఎస్టీ సంక్షేమం - రూ.7,937కోట్లు

బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు

మైనారిటీ సంక్షేమం - రూ.3,769 కోట్లు


రాజీవ్ యువ వికాసం - రూ.6వేల కోట్లు

గృహ నిర్మాణం - రూ.7,430 కోట్లు

ఐటీ రంగం - రూ.875 కోట్లు

పరిశ్రమలు - రూ.3,490 కోట్లు

చేనేత - రూ.258 కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.33,688 కోట్లు

సాగునీటి ప్రాజెక్టులు - రూ.22,615 కోట్లు

రవాణా శాఖ - రూ.12,759 కోట్లు

న్యాయ శాఖ - రూ.2,367 కోట్లు

పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ - రూ.17,907కోట్లు

శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు

గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు

పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు


పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 6416కోట్లు

హ్యాంమ్ రోడ్లకు 3053కోట్లు

రీజనల్ రింగ్ రోడ్డుకు 1525కోట్లు

రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000కోట్లు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు

పంట బీమా పథకానికి 1886 కోట్లు

మూసి రివర్ ఫ్రంట్ కు 1500కోట్లు

CURE ఏరియా అభివృద్ధికి 2654కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు

ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056కోట్లు

ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు

Updated Date - Mar 20 , 2026 | 01:06 PM