వ్యవసాయం, విద్య, ప్రజా క్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:44 PM
'ప్రజా క్షేమం - సామాజిక న్యాయం' అనే నినాదంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించింది. విద్య, సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, రాష్ట్ర భవిష్యత్తును మార్చే మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు.
ఆంధ్రజ్యోతి, మార్చి 20: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 తెలంగాణ బడ్జెట్‌లో 'ప్రజా క్షేమం - సామాజిక న్యాయం' అనే నినాదంతో ముందుకు సాగింది. సంక్షేమం, మౌలిక సదుపాయాలకు సమ ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయం, విద్య, మౌళిక సదుపాయాలు తదితర రంగాలకు భారీగా నిధులు కేటాయించారు.
బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చిన 5 కీలక రంగాలు ఇవే:
1. వ్యవసాయం, రైతు సంక్షేమం (రూ. 23,179 కోట్లు)
రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా, పంట బీమా, రుణమాఫీ పథకాలకు తెలంగాణ బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చారు. సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
2. విద్య, నైపుణ్యాభివృద్ధి (రూ. 26,674 కోట్లు)
రేవంత్ సర్కారు విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల పాఠశాలల నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు భారీగా నిధులు కేటాయించారు.
3. ప్రజా పాలన - ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం), గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్), రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధులను పుష్కలంగా కేటాయించారు.
4. మౌలిక సదుపాయాలు (మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు)
రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.
5. సామాజిక భద్రత (బీమా పథకాలు)
ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేందుకు 'ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం' కింద రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం ఈ బడ్జెట్‌లో ఒక కీలక అడుగు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News