టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు..
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:29 PM
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై (TTD EO Anil Kumar Singhal) ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రకు టీటీడీ ఈవోగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అప్పగిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై సీబీఐ సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆనాడు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను అనిల్ కుమార్ సింఘాల్ గుడ్డిగా అమలు చేశారని లేఖలో సిట్ అధికారులు పేర్కొన్నారు. అప్పుడు, ఇప్పుడు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్, ఆయన తర్వాత వచ్చిన ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారుడు బాలాజీలు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధికారులు లేఖ రాశారు. దీంతో సిట్ లేఖను ప్రభుత్వం అధ్యయనం చేసి వెంటనే అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కుట్రలు చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News