Share News

TTD: ‘ఆవూ లేదు.. పాలూ లేవు.. నెయ్యి ఎలా వచ్చింది సామీ

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:00 AM

కల్తీనెయ్యి కాదని వాదించే వైవీ సుబ్బారెడ్డి.. ఆయన పీఏ ఖాతాలోకి ఆ సంస్థలనుంచి కోట్లాది రూపాయలు ఎలా.. ఎందుకు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. ఈ వ్యవహారంపై విమర్శలు చేసే వైసీపీ నేతలు జగన్‌ హిందువని ధైర్యంగా చెప్పగలరా? గత ప్రభుత్వంలో అన్ని రకాల కల్తీలతో కోట్లు దోచుకున్న వైసీపీ నేతలు.. భగవంతుడినీ వదలకపోవడం చాలా బాధాకరం.’

TTD: ‘ఆవూ లేదు.. పాలూ లేవు.. నెయ్యి ఎలా వచ్చింది సామీ
నేతలు, శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

పలమనేరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఆవూ లేదు. పాలూ లేవు. మరి నెయ్యి ఎలా వచ్చింది సామి అంటూ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వైసీపీ నేతలపై వ్యంగాస్త్రాలను సంధించారు. టీటీడీ కల్తీనెయ్యి వ్యవహారం అంశంపై ‘మహాపాపం నిజం’ పేరిట శుక్రవారం పలమనేరులోని టవర్‌క్లాక్‌ సర్కిల్‌ నుంచి గంగమ్మ గుడి మీదుగా భూనీలా కల్యాణ వేంకటరమణస్వామి ఆలయం వరకు అమర్‌ ఆధ్వర్యంలో కూటమినేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికమంది నమ్మే దైవం కలియుగ వేంకటేశ్వరస్వామికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో మహాపచారం జరిగిందన్నారు. అప్పటి టీటీడీ పాలకవర్గం నిబంధనలకు పాతరవేసి పాలసేకరణే చేపట్టని డొల్ల సంస్థకు నెయ్యి సరఫరా అనుమతులు ఇచ్చిందన్నారు. ఈ అపచారంపై విచారం వ్యక్తం చేయకపోగా వైసీపీ నేతలు నోటికి వచ్చిందల్లా మాట్లాడటం దారుణమన్నారు. శ్రీవారికి ఎవరైనా అన్యాయం చేస్తే పుట్టగతులుండవని గుర్తించాలన్నారు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి.. తప్పు ఒప్పుకొంటే ఆ దేవుడు క్షమిస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు బాలాజీ కో ఆపరేటివ్‌ సూపర్‌ బజార్‌ అధ్యక్షుడు ఆర్వీ బాలాజీ, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు రాజన్న, టీడీపీ నాయకలు విష్ణువర్ధన్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌ రెడ్డి, సుబ్రహ్మణ్యం గౌడు, గిరిబాబు, ఖాజాపీర్‌, నాగరాజు, కృష్ణమూర్తి గౌడు, రూపేష్‌, కిషోర్‌గౌడు, రాంబాబు, సోమశేఖర్‌గౌడు, కుట్టి, నాగరాజరెడ్డి, ఆనంద, జనసేన నేత దిలీ్‌పకుమార్‌, బీజేపీ నాయకుడు శరవణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 02:01 AM