జగన్, వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి: వినోద్ బన్సల్
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:44 PM
తిరుమల వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం విషయంలో జగన్ హయాంలో జరిగిన ఘోర తప్పిదాన్ని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో రసాయనాల వాడకం అనేది కేవలం ఒక సాధారణ తప్పిదం కాదని ఆగ్రహించారు.
తిరుపతి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వర స్వామివారి లడ్డూప్రసాదం విషయంలో జరిగిన ఘోర తప్పిదాన్ని విశ్వ హిందూ పరిషత్ (VHP) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ (Vinod Bansal) తీవ్రంగా ఖండించారు. వైస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో రసాయనాల వాడకం అనేది కేవలం ఒక సాధారణ తప్పిదం కాదని ఆగ్రహించారు. ఇది హిందూ సమాజపు విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలపై జరిగిన వ్యవస్థీకృత, దీర్ఘకాల దాడి అని ధ్వజమెత్తారు. హిందూ వ్యతిరేక మనస్తత్వంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారు వినోద్ బన్సల్.
లడ్డూని రసాయనాలతో అపవిత్రం చేశారు..
వైసీపీ హయాంలో ఘోర నిర్లక్ష్యం వహించినందుకు గాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధార్మిక విశ్వాసాలను అవమానించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని హెచ్చరించారు. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను రసాయనాలతో అపవిత్రం చేయడం దారుణమని అన్నారు. జగన్ హయాంలో దేవాలయాల పవిత్రతను కాపాడటంలో పాలకమండలి పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హిందూ విశ్వాసాలపై, సంప్రదాయాలపై జరిగిన నిర్లక్ష్యం, వ్యతిరేక చర్యలను ఉపేక్షించకూడదని హెచ్చరించారు. దేవాలయాల పరిరక్షణకు ఏపీ సీఎం చంద్రబాబు పటిష్ట చర్యలు తీసుకోవాలని వినోద్ బన్సల్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Read Latest Telangana News And AP News And Telugu News