Share News

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం: హరీశ్ రావు

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:39 PM

తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గోదావరి బనకచర్లను ఆపితేనే‌‌ ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారని.. మరి ఇప్పుడెందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు..

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం: హరీశ్ రావు
Harish Rao

హైదరాబాద్, జనవరి 30: సీడబ్ల్యూసీ సమావేశంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు (Former Minister Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది తెలంగాణకు ‘మరణ శాసనం’ లాంటిదని, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసే ప్రయత్నమని ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తున్నారని, ప్లాన్ ప్రకారమే నల్లమల్ల సాగర్, బనకచర్లకు సహాయం చేస్తున్నారని ఆరోపించారు.


గోదావరి బనకచర్లను ఆపితేనే‌‌ ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారని.. మరి ఇప్పుడెందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. నీటిపారుదల, జల వనరుల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్.. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి అని, ఈ సమావేశానికి ఆయన ఎలా నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. నికార్సైన తెలంగాణ ఇంజనీర్ దొరకలేదా అని ధ్వజమెత్తారు.


ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని, ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం జరగబోతోందని ఆరోపించారు. కావాలనే సుప్రీం కోర్టులో చెల్లని రిట్ పిటిషన్ వేశారని, గోదావరి జలాల అక్రమ తరలింపుపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. ముల్లు కర్రతో పొడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 04:33 PM