Share News

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:59 AM

iGOT కర్మయోగి పోర్టల్‌లో కోటి కోర్సులకు దరఖాస్తులను ఏపీ పూర్తి చేసుకుంది. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నైపుణ్యంతో కూడిన భవిష్యత్తు వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారాయన.

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 30: iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh) సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. దేశంలో కోటి కోర్సుల దరఖాస్తులను పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ విజయాన్ని పంచుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu). ఈ పోర్టల్‌లో కోటికి పైగా ఎన్‌రోల్‌మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సులు పూర్తయ్యాయని.. 4,290 కోర్సుల ద్వారా ఇది సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు.


చంద్రబాబు ట్వీట్..

‘శుభవార్త! iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. 80 లక్షలకు పైగా కోర్సులకు శిక్షణ పూర్తైంది. మొత్తం 4,290 కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యాభివృద్ధి పొందారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిరంతర అభ్యాసం పట్ల బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(APSDPS) ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఈ కర్మయోగి కార్యక్రమం అమలవుతోంది. నైపుణ్యంతో కూడిన భవిష్యత్తు వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


iGOT కర్మయోగి పోర్టల్.. భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కర్మయోగి(Mission Karmayogi) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. దీనిని ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వీసెస్ అధికారుల కోసం, ఇతర అధికారుల కోసం రూపొందించారు. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం, నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయడం ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యం.


ఇవి కూడా చదవండి...

హోంగార్డు ఉద్యోగం.. అక్రమాస్తులు 20 కోట్లు

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 01:13 PM