Share News

చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్.. హైదరాబాద్‌ వ్యక్తి కీలక పాత్ర

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:22 AM

చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టును అహ్మదాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్.. హైదరాబాద్‌ వ్యక్తి కీలక పాత్ర
Child Trafficking

హైదరాబాద్/అహ్మదాబాద్, జనవరి 30: అహ్మదాబాద్ పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్‌ను(Child Trafficking Racket Busted) ఛేదించారు. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు(Hyderabad) అప్పుడే పుట్టిన శిశువును తరలిస్తుండగా ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ శిశు ట్రాఫికింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన రోషన్ అగర్వాల్ అనే ఏజెంట్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.


ఈ ముఠా అహ్మదాబాద్‌లోని ఒక ఆస్పత్రి నుంచి నవజాత శిశువును రూ.3.60 లక్షలకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని కొందరికి అమ్మాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే అహ్మదాబాద్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో నవజాత శిశువును గుర్తించారు. శిశువుకు సంబంధించి కారులోని వారిని ప్రశ్నించగా.. వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు బట్టబయలైంది.


ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్ రోషన్ అగర్వాల్, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అహ్మదాబాద్ పోలీసులు. ప్రస్తుతం చిన్నారి పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. శిశువు తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.

Updated Date - Jan 30 , 2026 | 01:21 PM