రేవంత్ నయా రికార్డ్.. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:03 AM
అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. 'లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ' కోర్సును సీఎం విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్ పొందారు.
హైదరాబాద్/అమెరికా, జనవరి 30: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమెరికాలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో(Harvard Kennedy School) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 'Leadership in the 21st Century: Chaos, Conflict, and Courage అనే కోర్సును పూర్తిచేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు.

జనవరి 25న ఈ కోర్సు ప్రారంభమవగా జనవరి 30 వరకు అంటే వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ కోర్సులో సీఎం రేవంత్‌తో పాటు 62 మంది కోహోర్ట్ విద్యార్థులు కూాడా పాల్గొన్నారు. దాదాపు 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో మైనస్ 24 డిగ్రీల తీవ్ర చలిలోనూ రేవంత్ రెడ్డి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులకు హాజరయ్యారు. కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, కన్సల్టేటివ్ వర్క్‌లతో కూడిన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారం, నాయకత్వం, సంఘర్షణలు, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పొందారు సీఎం.

ప్రోగ్రామ్ ముగిసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన 62 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అయితే భారతదేశ చరిత్రలో అధికారంలో ఉండగానే హార్వర్డ్ నుంచి ఈ రకమైన సర్టిఫికెట్ పొందిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు.


ఇవి కూడా చదవండి...
హోంగార్డు ఉద్యోగం.. అక్రమాస్తులు 20 కోట్లు
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
Read Latest Telangana News And Telugu News