సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరి.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:30 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నేతలు సమావేశంకానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈ సమావేశం జరుగనుంది.
హైదరాబాద్, జనవరి 24: మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) ఈరోజు (శనివారం) మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (Former CM KCR) కేటీఆర్, హరీశ్‌రావు సహా ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలతో బీఆర్‌ఎస్ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
గులాబీ బాస్‌కు కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ దూకుడు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
నంబర్ ఒక్కటే.. బైక్‌లు నాలుగు
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి..
Read Latest Telangana News And Telugu News