Share News

నంబర్‌ ఒక్కటే.. బైక్‌లు నాలుగు

ABN , Publish Date - Jan 24 , 2026 | 09:49 AM

నంబర్‌ ఒక్కటే.. కానీ బైక్‌లు మాత్రం నాలుగు తిరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బైక్‏లు వికారాబాద్‌, సంగారెడ్డి, బేగంపేట ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

నంబర్‌ ఒక్కటే.. బైక్‌లు నాలుగు

  • ట్యాంపర్‌ నంబర్‌ ప్లేట్‌తో రోడ్లపై మూడు

  • ఉల్లంఘనల చలాన్లు బైక్‌ ఓనర్‌కు

  • బైకుల్లో తేడా పట్టించుకోకుండా జరిమానా విధింపు

  • ఫైన్‌లు, వసూళ్లపైనే ట్రాఫిక్‌ పోలీసుల దృష్టి

హైదరాబాద్‌ సిటీ: ‘మీ బైక్‌ నంబర్‌తో మరో మూడు బైకులు రోడ్లపై తిరుగుతుంటే.. వారు చేసిన ఉల్లంఘనలకు మీకు జరిమానాలు వస్తుంటే..’ ఏమిటి పరిస్థితి ? సరిగ్గా ఇలాగే ఓ బైక్‌ యజమానికి షాక్‌ తగిలింది. సంగారెడ్డి(Sangareddy)కి చెందిన బేగరి గోపాల్‌కు టీఎస్‌ 34సీ1858 నంబర్‌ ఉన్న బైక్‌ ఉంది. ఇతడు ఒకసారి హెల్మెట్‌ లేకుండా పటాన్‌చెరు ప్రాంతంలో వెళుతుంటే ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధించారు. ఈ చలాన్‌ చెల్లంచేందుకు ఆన్‌లైన్‌లో వెతికిన గోపాల్‌ షాక్‌ అయ్యాడు.


తన బైక్‌ నంబర్‌పై మరో మూడు చలాన్లు ఉన్నట్లు గుర్తించాడు. ఈ చలాన్‌లకు సంబంధించిన ఫొటోలు చూసిన అతడు తన బైక్‌ నంబర్‌తో మరో మూడు బైకులు తిరుగుతున్నాయని తెలుసుకున్నాడు. అతడి బైక్‌ నంబర్‌ ఉన్న వాహనాలకు మారేపల్లి టీ జంక్షన్‌, పటాన్‌చెరు, బేగంపేటలో చలాన్లకు సంబంధించిన ఫొటోలు గుర్తించాడు. బాధితుడు బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలో ఉంటుండగా, ఇతడి బండి నంబర్‌ ప్లేట్‌తో తిరుగుతున్న వాహనాలు వికారాబాద్‌, సంగారెడ్డి, బేగంపేట(Vikarabad, Sangareddy, Begumpet) ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపాడు.


నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ చేసి బైకులు నడుపుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. బైక్‌ తేడా, రంగుల్లో తేడాలున్నా కనీసం గుర్తించకుండా చలాన్లు విధించడం ఎంత వరకు సబబని బాధితుడు వాపోతున్నాడు. ఫైన్‌లు విధింపు, చలాన్ల వసూళ్లపై దృష్టి పెడుతున్న ట్రాఫిక్‌ పోలీసులు ట్యాంపరింగ్‌ వాహనాలను గుర్తించే పనిపై దృడ్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..

జగన్‌ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2026 | 09:49 AM