Share News

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి..

ABN , Publish Date - Jan 24 , 2026 | 10:23 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. ఏఐఎఫ్‌బీ పార్టీకి చెందిన సింహం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని జాగృతి నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి..
Telangana Jagruti

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ జాగృతి నేతలు (Telangana Jagruti) స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మున్సిపాలిటీలతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీతో సంప్రదింపులు పూర్తి చేసిన తెలంగాణ జాగృతి నాయకత్వం.. ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశంపై ఏఐఎఫ్‌బీ పార్టీ, తెలంగాణ జాగృతి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది.


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. అయితే, పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఈలోపు రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతోపాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఏఐఎఫ్‌బీ సింహం గుర్తుతో బరిలోకి దిగాలని జాగృతి నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి...

నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

నంబర్‌ ఒక్కటే.. బైక్‌లు నాలుగు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2026 | 11:31 AM