Share News

ఘోర రోడ్డుప్రమాదాలు.. స్పాట్ లోనే ఇద్దరి మృతి..

ABN , Publish Date - Jan 24 , 2026 | 07:18 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఒకే విధమైన రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎదురుగా వెళ్తోన్న లారీలను ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదాలు జరిగాయి.

ఘోర రోడ్డుప్రమాదాలు.. స్పాట్ లోనే ఇద్దరి మృతి..
Prakasam district road accident

ఆంధ్రజ్యోతి, జనవరి 24: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధి కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆ ప్రైవేట్ బస్సును తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్‌లోనే మృతిచెందగా.. మరో 12మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.


ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తుని హైవేపై మరో ప్రమాదం..

కాకినాడ సమీపంలోని తుని హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారిపై వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందుగా వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఇవీ చదవండి:

ఏజెంటిక్‌ ఏఐలో కొలువులే కొలువులు

మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..

Updated Date - Jan 24 , 2026 | 08:12 AM