మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:01 PM
వరుస నష్టాల నుంచి గురువారం కాస్త కోలుకున్న సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. విదేశీ మదుపర్లు గురువారం 2,549 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్‌గా మారింది.
వరుస నష్టాల నుంచి గురువారం కాస్త కోలుకున్న సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. విదేశీ మదుపర్లు గురువారం 2,549 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్‌గా మారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడం, అదానీ గ్రూప్ హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు సూచీలను వెనక్కి లాగాయి. దీంతో సెనెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (81,537)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఉదయం లాభాల్లోనే కొనసాగాయి. ఒక దశలో దాదాపు 200 పాయింట్లు లాభపడి 82,516 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు భారీగా పతనమయ్యాయి. చివరకు సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడింది (stock market news today).
సుమారు 265 బిలియన్ డాలర్ల లంచం, మోసానికి సంబంధించిన ఆరోపణల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు అమెరికా రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చట్టబద్ధమైన సమన్లు పంపడానికి యూఎస్ కోర్టు అనుమతి కోరడంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ (14.5 శాతం), అదానీ ఎనర్జీ (12.12 శాతం), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (10.65 శాతం), అదానీ పోర్ట్స్ (7.48 శాతం) మొదలైన షేర్లు నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో బంధన్ బ్యాంక్, హిందుస్థాన్ జింక్, వోల్టాస్, నాల్కో, రెడ్డీస్ ల్యాబ్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). బ్యాంక్ నిఫ్టీ 727 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1,045 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.94గా ఉంది.
ఇవీ చదవండి:
తెలంగాణ ఇంటర్మీడియట్.. వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే