Share News

11లోపు రైతుబంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:11 PM

ముఖ్యమంత్రి రేవంత్‏రెడ్డిపై మాజీమంత్రి తన్నీరు హరీష్‏రావు ఫైర్ అయ్యారు. 11లోపు రైతు బంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు.. చీరి చింతకు కడ్తరు.. అంటూ వ్యాఖ్యానించారు. అసలు.. నువ్వు ముఖ్యమంత్రివా.. వీధి రౌడీవా.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

11లోపు రైతుబంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు

  • నువ్వు ముఖ్యమంత్రివా.. వీధి రౌడీవా..

  • గెలిచే దమ్ము లేకే అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు

  • సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

మెదక్‌: ‘ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11లోపు రైతుబంధు ఖాతాల్లో పడకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తరు. చీరి చింతకు కడ్తరు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు(Hareesh Rao) సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు.. మగవాళ్ళకు డబుల్‌ టికెట్‌ ధరలు పెట్టడం అన్యాయమని హరీశ్‌ అభిప్రాయపడ్డారు. బుధవారం మెదక్‌లో మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సభలో, గుమ్మడిదలలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడని, ఇక ఆయన అబద్ధాలను రైతులు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు.


రేవంత్‌రెడ్డి నువు ముఖ్యమంత్రివా... లేక వీధి రౌడీవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతామనే భయంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారని మండిపడ్డారు. ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటామని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ చెబుతే మేము పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టామని, మరి రేవంత్‌రెడ్డి రాజీనామాకు బదులు జిరాక్స్‌ పేపర్‌ పంపిన దొంగవని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ కారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహిగా ఆయనను అభివర్ణించారు.


hareesh1.2.jpgఆరు గ్యారంటీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని, దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. ‘సిగాచి’ ప్రమాదంలో 52 మంది కార్మికులు చనిపోతే వారికి రూ. కోటి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా నెరవేర్చలేదని ఆరోపించారు. వివేక్‌వెంకటస్వామి.. కార్మికశాఖ మంత్రిగా ఉన్నా పరిహారం ఇప్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లు ఓటుకు రూ.5వేలు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు బీఆర్‌ఎ్‌సకు ఓటేయండని హరీశ్‌ పేర్కొన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండుసున్నా ఇచ్చారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్‌ పూర్తి నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2026 | 12:11 PM