ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విచారణ ప్రారంభం
ABN, Publish Date - Feb 01 , 2026 | 03:16 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (Former CM KCR) సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నివాసం చుట్టు పక్కల పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Updated at - Feb 01 , 2026 | 03:18 PM