ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రణీత్ రావు హోదా తగ్గింపు..
ABN , Publish Date - Feb 04 , 2026 | 08:52 AM
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రణీత్ రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతిని రేవంత్ సర్కారు రద్దు చేసింది (Praneeth Rao DSP rank revoked).
ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేసి ఝులక్ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక నుంచి ప్రణీత్ రావు ఇన్‌స్పెక్టర్ గానే కొనసాగనున్నారు. సాధారణంగా ఉగ్రవాదుల అణిచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు మాత్రమే ప్రభుత్వం యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పిస్తుంది (Telangana phone tapping case).
2007 బ్యాచ్‌లో ఎస్సైలు అయిన 300 మందిలో కేవలం ప్రణీత్ రావుకు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది (Praneeth Rao accused). దీనిపై అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి. కేవలం ఫోన్ ట్యాపింగ్ చేసినందుకే ప్రణీత్ రావును అందలం ఎక్కించినట్టు విమర్శలు వినిపించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రణీత్ రావును రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో పలుసార్లు ప్రణీత్ రావును విచారించిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..