Fitness Secret: 40 ఏళ్ల వయసులోనూ నవ యవ్వనంగా ఉండాలంటే.. అదిరిపోయే సీక్రేట్స్..
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:28 PM
ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదనలో పడి.. అసలైన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తీరా.. అనారోగ్యానికి గురయ్యాక అప్పుడు ఆలోచిస్తూ చింతిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు పురుషులైనా.. స్త్రీలు అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ,
Diet Chart for Women: ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదనలో పడి.. అసలైన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తీరా.. అనారోగ్యానికి గురయ్యాక అప్పుడు ఆలోచిస్తూ చింతిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు పురుషులైనా.. స్త్రీలు అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, ఆ తరువాత నుంచి అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. శరీరం బలహీనంగా మారడం, నిర్జీవంగా అనిపించడం ప్రారంభం అవుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు.. మొదలవుతాయి. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు సర్వసాధారణం. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 40 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో స్వల్ప మార్పులు చేసుకుంటే నవయవ్వనంగా ఉండొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి 40 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే.. మీరు తినే ఆహారాలపై ముందుగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మన ఆరోగ్యం మన తినే ఆహారంలో, మన జీవనశైలిలోనే ఉంటుంది. ఎక్కువగా మీ ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. తృణధాన్యాలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. మీ రోజువారీ డైట్‌లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోండి. శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందింతే.. ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల తరువాత శరీరానికి ప్రోటీన్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తినాలి. రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఇవి మిమ్మల్ని కాపాడుతాయి. వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.
డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన తృణధాన్యాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతీరోజూ వీటిని తీసుకోవడం ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది.
గుడ్లు, పాలు వంటి అధిక పోషకాలు ఉండే వాటిని తీసుకోవాలి. రోజూ గుడ్లు తినడం వలన శరీరంలో ప్రోటీన్స్ లోపాన్ని సరి చేస్తాయి. శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది.
Also Read:
శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మాంసం, మద్యం పట్టివేత
అటల్ చూపిన మార్గంలోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు
ఆ స్టార్ బ్యాటర్ ఆట చూసేందుకు చెట్లెక్కిన అభిమానులు.. వీడియో