Share News

Srisailam Toll Gate: శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మాంసం, మద్యం పట్టివేత

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:12 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 200 కేజీల చికెన్, మటన్‌తో పాటు నిషేధిత మద్యం పట్టుబడింది. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న బైకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

Srisailam Toll Gate: శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మాంసం, మద్యం పట్టివేత
Srisailam Toll Gate

కొంతమంది దుర్మార్గులు పరమ పవిత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్ర పరిధిలో తప్పుడు పనులు చేయడానికి సిద్ధమయ్యారు. భారీగా మాంసం, మద్యాన్ని క్షేత్ర పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టోల్ గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు.


ఈ నేపథ్యంలోనే రెండు వందల కేజీల మాంసాహారం పట్టుబడింది. చికెన్, మటన్‌తో పాటు మద్యం కూడా పట్టుబడింది. కొందరు స్దానికులు వీటిని క్షేత్ర పరిధిలోకి తీసుకెలుతుండగా సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం, మాంసంతో పట్టుబడిన బైకులను సెక్యూరిటీ అధికారులు స్టేషనుకు తరలించారు.


ఇవి కూడా చదవండి

ఆ స్టార్‌ బ్యాటర్ ఆట చూసేందుకు చెట్లెక్కిన అభిమానులు.. వీడియో

ఇతడి తెలివికి ఫిదా కావాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..

Updated Date - Dec 25 , 2025 | 04:21 PM