Share News

Kohli Fans Climb Trees: ఆ స్టార్‌ బ్యాటర్ ఆట చూసేందుకు చెట్లెక్కిన అభిమానులు.. వీడియో

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:00 PM

సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రాంతంలోకి వస్తే.. ఎలాగైనా చూడాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ అభిమానులు.. ఏకంగా చెట్లు ఎక్కి.. తమ అభిమాన ప్లేయర్ ఆటను వీక్షించారు.

Kohli Fans Climb Trees: ఆ స్టార్‌ బ్యాటర్ ఆట చూసేందుకు చెట్లెక్కిన అభిమానులు.. వీడియో
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది. అందుకే స్టార్ ప్లేయర్లు, స్టార్ హీరోలను చూసేందుకు అభిమానులు అనేక పాట్లు పడుతుంటారు. పలు సందర్భాల్లో తమ ప్రాంతానికి వచ్చిన సెలబ్రిటీలను, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి.. కొన్ని స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ ఆటను చూసేందుకు ఆయన అభిమానులు చెట్లు ఎక్కారు. మరి.. ఆ స్టార్ ప్లేయరు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


విజయ్‌ హజారే టోర్నీ (Vijay Hazare Trophy 2025-26) నిన్న(బుధవారం) ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఢిల్లీ జట్టు తరఫున ఈ టోర్నీలో పాల్గొన్నాడు. అంతేకాక ఈ స్టార్‌ బ్యాటర్‌ సెంచరీతో (131; 101 బంతులు) మెరిశాడు. దీంతో కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కింగ్ ప్రత్యేకంగా తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ కోహ్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బుధవారం జరిగిన ఢిల్లీ, ఆంధ్ర మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అలాగే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్ 1 గేట్లను తెరవకుండానే ఈ మ్యాచ్‌ను బీసీసీఐ (BCCI) నిర్వహించింది. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.


అయితే కొందరు కోహ్లీ అభిమానులు మాత్రం తమ అభిమాన ప్లేయర్ ను చూడాలని ప్రమాదకర స్టంట్స్ చేశారు. కొందరు ప్రమాదకర రీతిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న చెట్లపైకి చేరి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ను వీక్షించారు. భద్రతా కారణాలను చూపుతూ కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (KSCA) మ్యాచ్‌లను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు (COE) మార్చాల్సి వచ్చింది. దీంతో ఢిల్లీ, ఆంధ్ర మ్యాచ్‌ను అభిమానులు వీక్షించలేకపోయారు. అభిమానుల కేరింతలు, చప్పట్లు లేకుండానే విరాట్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అలానే సైలెట్ వాతావరణంలోనే అతడు తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్‌ బ్యాటర్లు ఆడే మ్యాచ్‌లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని క్రికెట్ ప్రియులు, విశ్లేషకులు బీసీసీఐని కోరుతున్నారు.


ఇవీ చదవండి:

మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్

బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

Rinku Singh Vijay Hazare Trophy: చెలరేగి ఆడిన రింకూ సింగ్..

Updated Date - Dec 25 , 2025 | 04:00 PM