Viral Video: ఇతడి తెలివికి ఫిదా కావాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..
ABN , Publish Date - Dec 25 , 2025 | 03:59 PM
చలికాలంలో చాలా మంది రూమ్ హీటర్లు కొనుక్కుని ఇళ్లను వెచ్చగా మార్చుకుంటున్నారు. అంత ఖర్చు చేయలేని ఒక వ్యక్తి బుర్రకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణ చేశాడు. చాలా చవకగా ఇటుకతో రూమ్ హీటర్ తయారు చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లు ఆ కుర్రాడిని ప్రశంసిస్తున్నారు
ప్రస్తుతం చలి కాలం (Winter) కావడంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు చలికి వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది రూమ్ హీటర్లు (Room Heater) కొనుక్కుని ఇళ్లను వెచ్చగా మార్చుకుంటున్నారు. అంత ఖర్చు చేయలేని ఒక వ్యక్తి బుర్రకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణ చేశాడు. చాలా చవకగా ఇటుకతో రూమ్ హీటర్ తయారు చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లు ఆ కుర్రాడిని ప్రశంసిస్తున్నారు (Viral Video).
maximum_manthan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఇటుకపై భాగాన్ని డ్రిల్లింగ్ మెషీన్‌తో కట్ చేశాడు. అక్కడ కాయిల్ సెట్ చేశాడు. అలాగే వైర్, ప్లగ్‌లను ఆ ఇటకకు బోల్ట్‌ల సహాయంతో అమర్చాడు. అనంతరం ఆ ప్లగ్‌ను బోర్డ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. కొద్ది సేపటికే ఆ కాయిల్ మండి వెచ్చదనం అందించడం ఆ వీడియోలో కనబడుతోంది (Brick Heater). చాలా తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు (cheap room heater jugaad).
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు (brick heater viral video). ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారిందిఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మంది వీక్షించారు. 7.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ రూమ్ హీటర్ ఖరీదు చాలా తక్కువని ఒకరు కామెంట్ చేశారు. అలాగే ఇది చాలా ప్రమాదకరమని మరొకరు పేర్కొన్నారు. ఇది మంచి ఆలోచనే అని, ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మరొకరు సూచించారు. వావ్.. గ్రేట్ జుగాడ్ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..