Home » Health Secrets
పాలు, పాల ఉత్పత్తులు వినియోగించే వారిపై కార్డియా ఓ అధ్యయనం చేసింది. యుక్త వయస్సులో ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు వినియోగించినప్పుడు వారి గుండె ధమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడానికి గల సంబంధాన్ని సైంటిస్టులు పరిశోధించారు. ఎందుకంటే దమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
నిత్యం వినియోగించే టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి, బీపీ నియంత్రణకు సహకరిస్తుంది.
జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా తాగితే గ్యాస్, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.
ముఖ్యంగా గుండె సంబంధిత రోగులకు మటన్ పాయా సూప్ తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది కొవ్వులను అధికంగా కలిగి ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు సూప్ తాగకూడదని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది మృతి చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
సీతాఫలంను కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎలర్జీతో బాధపడేవాళ్లు సీతాఫలం తిన్న వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించవచ్చు.
అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే మహత్యం ఒక్క అరటి పండులో ఉందంటే అంత నమ్మశక్యంగా లేదు కదూ. కానీ మనిషికి చేటు చేసే అనారోగ్యాన్ని పారద్రోలే శక్తి మాత్రం అరటి పండులో ఉందంటే మీరు నమ్మగలరా?..
హై బీపీ.. ప్రస్తుతం ఈ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. వైద్యులు వద్దకు వెళ్లితే.. భారీగా ఫీజు వసూల్ చేస్తున్నారు. దీనితోపాటు అత్యంత ఖరీదైన మందులు రాస్తున్నారు. దీంతో సామాన్య మానవులు తట్టుకోలేక పోతున్నారు. అలాంటి వేళ.. హై బీపీ నియంత్రణకు ఇంట్లోనే సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.