Share News

Health Tips: చలికాలంలో గోధుమ, శనగ పిండితో చేసిన చపాతీ తింటే ఇన్ని ప్రయోజనాలా..?

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:58 PM

బరువు తగ్గాలనుకునే చాలా మంది రాత్రి సమయంలో చపాతీ తింటుంటారు. తద్వారా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. అయితే, మంచి పోషకాలు, టేస్ట్ కోసం గోధుమ పిండిలో కొద్దిగా శనగపిండి కలిపితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

Health Tips: చలికాలంలో గోధుమ, శనగ పిండితో చేసిన చపాతీ తింటే ఇన్ని ప్రయోజనాలా..?
Wheat Besan Chapati Benefits

శీతాకాలంలో చాలా మంది ఎక్కువగా లైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. కారణం.. ఈ సీజన్‌లో హెవీ ఫుడ్ తీసుకుంటే జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే.. చాలా మంది హెల్తీ డైట్‌ను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా రైస్ తినొద్దని భావించే వారు.. చపాతీలను తింటారు. మీరు కూడా చపాతీలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? మీరు తినే చపాతీలు మరింత టేస్టీగా, హెల్తీగా ఉండాలంటే ఓ పని చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ పిండిలో కాసింత శనగపిండి కూడా కలిపి చపాతీ చేస్తే టేస్ట్‌కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో గోధుమ పిండిలో శనగపిండి కలిపి చపాతీ చేసుకుని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


శీతాకాలంలో గోధుమ, శనగ పిండితో చపాతీలు ఎందుకు చేసుకోవాలి..?

ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు శరీరం సహజంగానే శక్తి అవసరం అవుతుంది. ఇందుకోసం ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అందుకే.. శనగపిండి కలిపిన చపాతీలు తినడం వలన డబుల్ బెనిఫిట్స్ అందుతాయి.

గోధుమ పిండిలో బేసన్(శనగపిండి) కలిపి చపాతీ చేయడం వలన కలిగే 5 ప్రయోజనాలు ఇవే..

1. ఎక్కువ ప్రోటీన్స్.. యూఎస్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 100 గ్రాముల బేసన్‌లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే 100 గ్రాముల గోధుమ పిండిలో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే.. గోధుమ పిండిలో బేసన్‌ను కలిపి చపాతీ చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ మొత్తంలో బేసన్ కలపడం వల్ల చపాతీ రుచి మారకుండా ఉంటుంది. అదే సమయంలో ప్రోటీన్స్ ఎక్కువగా అందుతాయి. చపాతీ/రోటీలను ఎక్కువగా ఇష్టపడే వారు ఇలా చేసుకుని తింటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.


2. ఎక్కువ సమయం కడుపు నిండినట్లుగా ఉంటుంది. సాధారణ గోధుమ పిండితో పోలిస్తే.. బేసన్‌లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. గోధుమ, బేసన్ కలిపి చేసిన చపాతీ తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. జీర్ణం కూడా చాలా నెమ్మదిగా అవుతుంది. గోధుమ, బేసన్ మిశ్రమంతో తయారు చేసిన రోటీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. చిరుతిళ్లు తినాలనే ఆలోచనను నివారిస్తుంది. గోధుమ-బేసన్ మిశ్రమంతో తయారు చేసిన రోటీలు మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

3. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 2012లో జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. బేసన్‌ గ్లైసెమిక్ ఇండెక్స్ 6 పాయింట్స్ ఉంటుంది. ఇది శుద్ధి చేసిన పిండి కంటే కూడా చాలా మంచిది. గోధుమ పిండికి బేసన్ కలిపి చేసిన ఆహారాలు తినడం వలన రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది. భోజనం తరువాత చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, ప్రోటీన్స్ ఉన్న పదార్థాలతో కలిపి రోటీలు తింటే మరింత మేలు జరుగుతుంది.


4. వెరైటీగా ఉంటుంది. రోజువారీ పోషకాహారానికి ఇది వెరైటీగా ఉంటుంది. ప్రతీ రోజూ ఒకే రకమైన పిండితో చేసిన రోటీలను తినడం వలన శరీరానికి అందే పోషకాల పరిధి పరిమితం అవుతుంది. శనగపిండిని కలిపి తీసుకుంటే.. ఐరన్, మెగ్నీషియం, ఫోలెట్ వంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. అందుకే.. గోధుమ, శనగపిండితో కలిపి చేసిన చపాతీలు తినడం ఉత్తమం.

5. చపాతీలు/రోటీలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండి, బేసన్ పిండిని సరైన నిష్పత్తిలో ఉపయోగించినప్పుడు రోటీల టేస్ట్ మరింత పెరుగుతుంది. మృదువుగా, టేస్టీగా ఉంటాయి. ఈ మిశ్రమంతో తయారు చేసిన రోటీలు, చపాతీలు ఆయిల్‌ను కూడా తక్కువగా పీల్చుకుంటాయి. ఈ విధంగానూ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.


గోధుమ, బేసన్ మిక్స్ చపాతీ ఎవరు తినొద్దంటే..

కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం, జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ రకమైన చపాతీలు తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నరు. ముఖ్యంగా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు, జీర్ణ సమస్యల నుంచ కోలుకుంటున్నవారు శనగపిండితో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గోధుమ పిండిలో శనగపిండి ఉపయోగించడం వల్ల ఫైబర్ ఓవర్ లోడ్ అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు.. దీనిని త్వరగా జీర్ణం చేసుకోలేరు.


Also Read:

Talasani: అది 'సిగ్గులేని సంసారం': తలసాని శ్రీనివాస్ యాదవ్

Nadendla Manohar: పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం: మంత్రి నాదెండ్ల

PM Modi in WB: బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం.. మోదీ పర్యటనకు ఆటంకం.!

Updated Date - Dec 20 , 2025 | 03:58 PM