Share News

Health Tips: సాయంత్రం 6 తరువాత ఈ ఫుడ్స్ అస్సలు తినకండి..

ABN , Publish Date - Dec 31 , 2025 | 03:47 PM

ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త పెరిగిందనే చెప్పాలి. అనారోగ్యకరమైన ఫుడ్స్‌కి దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అయితే, కొందరు మాత్రం టేస్ట్‌కి ప్రాధాన్యత ఇస్తూ ఇష్టమొచ్చినట్లుగా ఏదిపడితే అది తినేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై.. ఆ తరువాత బాధపడుతున్నారు. సమయం ప్రకారం ఆహారం తింటే..

Health Tips: సాయంత్రం 6 తరువాత ఈ ఫుడ్స్ అస్సలు తినకండి..
Health Tips

ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త పెరిగిందనే చెప్పాలి. అనారోగ్యకరమైన ఫుడ్స్‌కి దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అయితే, కొందరు మాత్రం టేస్ట్‌కి ప్రాధాన్యత ఇస్తూ ఇష్టమొచ్చినట్లుగా ఏదిపడితే అది తినేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై.. ఆ తరువాత బాధపడుతున్నారు. సమయం ప్రకారం ఆహారం తింటే ఎలాంటి సమస్యా ఉండదు.. అది కూడా మంచి ఆహారం తింటే ఆరోగ్యం పది కాలాలపాటు పదిలంగా ఉంటుంది. కాదని జంక్ ఫుడ్స్ అన్నీ లాగేస్తే.. శరీరం మొత్తం రోగాల పుట్టగా మారుతుంది. అందుకే.. తినే ఆహారంలో విషయంలో జాగ్రత్త వహిస్తే.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ సంగతి ఇటుంచితే.. సాయంత్రం అవగానే చాలా మంది చిరుతిళ్లపై ఆసక్తి పెరుగుతుంది. స్నాక్స్ తినాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ, సాయంత్రం సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తరువాత కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దని చెబుతున్నారు. ఇది జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుందని, బరువు పెరగడం, మధుమేహం బారిన పడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. సమోసాలు, పకోడీలు, స్వీట్స్, ఇతర జంక్ ఫుడ్స్ సాయంత్రం తినడం వలన శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుందని, చెక్కర స్థాయిలు పెరుగుతాయని.. ఫలితంగా ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి సాయంత్రం సమయంలో ఏం తినాలి.. ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


సాయంత్రం 6 తరువాత వీటిని తినకండి..

  • మంచి రుచి కోసం జంక్ ఫుడ్స్ అన్నీ తింటే.. శరీరంలో కొవ్వు పెరగడం, చక్కెర స్థాయిలు పెరగడం జరుగుతుంది. సాయంత్రం వేళ జంక్ ఫుడ్స్, స్వీట్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండండి.

  • నూనెలో వేయించిన ఆహారాలు: సమోసాలు, పకోడీలు, బజ్జీలు వంటి పదార్థాలు తినొద్దు.

  • జంక్ ఫుడ్స్: పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహారాలు తినకుండా ఉండండి.

  • డెజర్ట్స్: అధిక షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్స్ జోలికి వెళ్లొద్దు.

  • మాసాలాలు, ఆయిల్ అధికంగా ఉండే ఫుడ్స్ అస్సలు తినొద్దు.


తింటే ఏమవుతుంది..?

జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ వంటి పదార్థాలు సాయంత్రం సమయంలో తినడం వలన అనారోగ్యానికి గురవుతారు. ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వలన కడుపులో మంట సమస్య వస్తుంది. జంక్ ఫుడ్స్‌లో ఉండే అధిక కేలరీలు శరీరంలో వేగంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.


ఇవి తింటే ఆరోగ్యానికి మేలు:

  • ఆయిల్ లేకుండా వేయించిన మఖానా ఆరోగ్యానికి మంచిది.

  • ఉడికించిన స్వీట్‌కార్న్ తినడం ఉత్తమం.

  • వేడి కూరగాయల సూప్.

  • తక్కువ నూనెతో చేసిన పనీర్ ఫ్రై, స్పైసీ చిక్‌పీస్.

  • గోధుమ పిండితో చేసిన కుడుములు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Updated Date - Dec 31 , 2025 | 03:47 PM