No Sugar Challenge: 10 రోజులు షుగర్ తీసుకోవడం మానేస్తే శరీరం జరిగే మార్పులివే..
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:15 PM
కొత్త సంవత్సరం వచ్చేసింది. చాలా మంది నూతన సంవత్సరంలో తమ జీవితంలో మార్పుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో ఎదగడం కోసం, మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
10 Days No Sugar Challenge: కొత్త సంవత్సరం వచ్చేసింది. చాలా మంది నూతన సంవత్సరంలో తమ జీవితంలో మార్పుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో ఎదగడం కోసం, మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఒక ఛాలెంజ్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీరు ఈ ఛాలెంజ్‌లో సక్సెస్ అయితే.. మీ శరీరంలో కలిగే మార్పులను మీరే స్వయంగా గమనించవచ్చు. మరి ఆ ఛాలెంజ్ ఏంటా? అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో చాలా మంది వర్క్ బిజీలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు టేస్ట్ కోసం ఆరోగ్యాన్ని పనంగా పెడుతున్నారు. ఫలితంగా అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు.. కొన్ని ఆహారాలు తినకూడనివి కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పాలంటే షుగర్ అని చెప్పొచ్చు. అవును, అధిక బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి, మధుమేహం వంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు షుగర్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక్క పది రోజులు షుగర్ లేని ఆహారాలు తింటే శరీరంలో కలిగే మార్పులను మీరే గమనిస్తారని.. ఆ తరువాత మీరే షుగర్‌ను దూరం పెడతారని చెబుతున్నారు. మరి షుగర్ పదార్థాలు తినకుండా ఉండటం వలన కలిగే ప్రయోజనాలేంటి? శరీరంలో వచ్చే మార్పులు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
వాస్తవానికి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి కార్పోహైడ్రేట్స్ కలిగిన అన్ని ఆహారాలలో చక్కెర సహజంగానే ఉంటుంది. సహజ చక్కెర పదార్థాలను తినడం వలన ఎలాంటి హానీ ఉండదు. అయితే, మనం తినే ఆహారాలలో ఎక్కువ షుగర్‌ను కలిపి తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చక్కెర, తీపి పదార్థాలు తీసుకోవడం ఆపేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రారంభంలో కొంతమంది ఒకేసారి చక్కెర తీసుకోవడం తగ్గించినప్పుడు తలనొప్పి, అలసట, మానసిక స్థితిలో మార్పులు ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ, దీర్ఘ కాలంలో ఇది మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
షుగర్ కంటెంట్ తినకపోవడం వలన ఏం జరుగుతుంది?
10 రోజులు చక్కెర తీసుకోవడం ఆపడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం ఆరు రోజుల్లో మెరుగుపడుతుంది. మానసిక స్థితి వారంలోనే మారుతుంది. చర్మం పది రోజుల్లో ప్రకాశవంతంగా కనిపిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. శరీర బరువులో మార్పులను గమనించడానికి.. కనీసం ఒక నెల రోజులపాటు చక్కెరకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పెద్దలు రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని, రెండు నుండి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు 14 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ షుగర్ ఫ్రీ ఛాలెంజ్‌ను స్వీకరించి.. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి.
Also Read:
Yadagirigutta Temple: ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
Baking Soda Vs Baking Powder : బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?
KTR comments: నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇస్తారా: కేటీఆర్