Baking Soda Vs Baking Powder : బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:54 PM
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్.. వంటకాల్లో ఎంతో ఉపయోగకరమైన పదార్థాలు. అయితే, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వీటిని ఎప్పుడు ఉపయోగించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్.. వంటకాల్లో ఎంతో ఉపయోగకరమైన పదార్థాలు. అయితే, వీటి మధ్య చాలా కీలకమైన తేడాలు ఉన్నాయి. మీరు ఈ పదార్థాలను వాడేటప్పుడు, అవి మీ వంటకాలకు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి ఒక్కో సమయంలో వేర్వేరు విధంగా పనిచేస్తాయి. కాబట్టి వాటి మధ్య తేడాలను అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వాటిని ఎప్పుడు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్, NaHCO₃) అనేది వంటలో కేకులు, బ్రెడ్ వంటివి మెత్తగా, గుల్లగా రావడానికి వాడే ఒక రసాయన పదార్థం. అలాగే ఇది అజీర్ణం, యాంటాసిడ్‌గా, ఇంటి శుభ్రతకు, వాసనలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కొద్దిగా ఉప్పగా, ఆల్కలీన్‌గా ఉండే తెల్లటి పొడి. బేకింగ్ సోడాలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. వైద్య సలహా మేరకే మాత్రమే వాడాలి.
బేకింగ్ పౌడర్
బేకింగ్ పౌడర్ అనేది కేకులు, కుకీలు వంటి వాటిని మెత్తగా, ఉబ్బెత్తుగా చేయడానికి ఉపయోగించే ఒక రసాయన పదార్థం. ఇది బేకింగ్ సోడా, ఒక పొడి ఆమ్లం కార్న్ స్టార్చ్ వంటి వాటితో తయారవుతుంది. తడి పదార్థాలు కలిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ను విడుదల చేసి, పిండిలో బుడగలు ఏర్పరచి, వంటకం ఉబ్బేలా చేస్తుంది. దీనిని డబుల్ యాక్షన్ బేకింగ్ పౌడర్ అంటారు. ఇది తేమ, వేడి రెండింటితో పనిచేస్తుంది. బేకింగ్ పౌడర్‌ను కేకులు, మఫిన్లు, కుకీలు, పాన్‌కేక్‌లు, ఇతర బేక్ చేసిన వస్తువులు, సమోసాలు వంటివి చేయడానికి ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడా VS బేకింగ్ పౌడర్
బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్) అనేది ఒక బేస్, ఇది పనిచేయడానికి నిమ్మరసం, పెరుగు, మజ్జిగ వంటి యాసిడ్ అవసరం, ఇది వెంటనే కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది. బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా, డ్రై యాసిడ్ (క్రీమ్ ఆఫ్ టార్టార్), కార్న్ స్టార్చ్ మిశ్రమం, దీనికి కేవలం తేమతోనే చర్య జరిగి వేడితో యాక్టివేట్ అవుతుంది. కాబట్టి దీనికి ప్రత్యేక యాసిడ్ అవసరం లేదు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News