KTR comments: నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇస్తారా: కేటీఆర్
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:43 PM
శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఅర్ఎస్‌కు కూడా అవకాశం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సభలో సమాన హక్కులు ఇవ్వాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు
నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఅర్ఎస్‌కు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సభలో సమాన హక్కులు ఇవ్వాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు (KTR on river waters).
'మేము మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి. చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా ( KTR slams CM). మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా. సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో వివరిస్తారా. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో చెప్పబోతున్నారా. రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా' అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చెరువునూ బాగు చేయలేదని, ఒక్క కాలువనూ మరమ్మత్తు చేయలేదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 516ల మధ్యలో 519 ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
సౌదీ అరేబియాలో మంచు వర్షం.. ఆ అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా..