Share News

Yadagirigutta Temple: ఈవో వెంకట్రావు రాజీనామా.. ఆమోదించిన సర్కార్

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:55 PM

యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్‌మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.

Yadagirigutta Temple: ఈవో వెంకట్రావు రాజీనామా.. ఆమోదించిన సర్కార్
Yadagirigutta Temple

యాదగిరిగుట్ట, జనవరి1 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు (Yadagirigutta temple EO Venkata Rao) రాజీనామా చేశారు.. దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్‌మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా వెంకట్రావు రాజీనామా చేశారని తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ఒత్తిడితోనూ ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.


అయితే వెంకట్రావు రాజీనామా వ్యవహారం బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈవో వెంకట్రావు రాజీనామాపై యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కాగా ప్రభుత్వం ఈ పరిణామాన్ని గమనించి ఆలయ పరిపాలనలో అవసరమైన మార్పులు చేపడతున్నట్లు సమాచారం. దీంతో యాదగిరిగుట్ట ఆలయ కార్యక్రమాల కొనసాగింపు, భక్తుల సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పబ్బులపై ఈగల్ టీం సోదాలు.. డీజేలు అరెస్ట్..

ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

For More TG News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 06:41 PM