Travis Head Ashe: యాషెస్ సిరీస్ హీరో ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:36 PM
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ కు సంబంధించి మిగిలిన మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: యాషెస్ సిరీస్ 2025-26 సీజన్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(Travis Head ) సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి బ్యాటింగ్ దెబ్బకు తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆ టెస్టులో టీ20 తరహాలో హెడ్ చెలరేగి ఆడాడు. ఈ సిరీస్ లో 629 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుతం హెడ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అలాంటి హిట్టర్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ కు సంబంధించి మిగిలిన మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరో స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) కూడా దూరంగా ఉండనున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్(BBL) 15వ సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్ ముగియడటంతో బీబీఎల్-15 మరింత రసవత్తరంగా మారనుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు తమ తమ బీబీఎల్ ఫ్రాంచైజీల్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఈక్రమంలో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లబుషేన్ బ్రిస్బేన్ హీట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. బీబీఎల్-15 సీజన్ లో మిగిలిన మ్యాచ్‌లలో బ్రిస్బేన్ హీట్ కెప్టెన్‌గా ఖవాజా వ్యవహరించనున్నాడు. జనవరి 10న సిడ్నీ థండర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో లబుషేన్(Marnus Labuschagne), ఖవాజా ఆడనున్నారు.
అదేవిధంగా సిడ్నీ సిక్సర్స్ తరపున స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith), స్పిన్నర్ టాడ్ మర్ఫీ బరిలోకి దిగనున్నారు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌కు వీరిద్దరూ అందుబాటులో ఉండనున్నారు. యాషెస్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' నిలిచిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వారం రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. జనవరి 16న జరిగే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్ తరపున ఆడనున్నాడు. స్టార్క్ బీబీఎల్‌లో ఆడనుండడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అడిలైడ్ స్ట్రైకర్స్‌కు అలెక్స్ కారీ, పెర్త్ స్కార్చర్స్‌కు జోష్ ఇంగ్లిష్ రిచర్డ్‌సన్ , మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు బ్రెండన్ డాగెట్ ప్రాతినిథ్యం వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
Bangladesh Cricket: బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. ఆర్థికంగా కుదేలు కానున్నారా..?