WPL 2026: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Jan 09 , 2026 | 07:24 PM
మహిళల ప్రీమియర్ లీగ్(WPL-2026) సీజన్ షురూ అయింది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్(WPL-2026) సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ చేయనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముంబై స్టార్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ దూరమైంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ నికోలా కారీ ముంబై తరపున డబ్ల్యూపీఎల్ అరంగేట్రం చేసింది. బెంగళూరు తరపున అయితే ఏకంగా ఆరుగురు ప్లేయర్లు అరంగేట్రం చేశారు. గ్రేస్ హారిస్,లిన్సే స్మిత్, లారెన్ బెల్, అరుంధతి రెడ్డి వంటి స్టార్ ప్లేయర్లకు ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం.
తుది జట్లు:
ముంబై:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్ బ్రంట్, కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్
బెంగళూరు:
స్మృతి మంధాన(కెప్టెన్), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
Bangladesh Cricket: బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. ఆర్థికంగా కుదేలు కానున్నారా..?