Share News

Himachal Pradesh: లోయలో పడిన టూరిస్టు బస్సు.. 8 మంది మృతి

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:23 PM

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం హరిపుర్దార్ ఏరియాలోని ఇరుకైన రహదారిపై వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. తక్షణ హాయక కార్యక్రమాలు చేపట్టినట్టు సిర్మూర్ ఎస్పీ నిశ్చింత్ సింగ్ నెగి తెలిపారు.

Himachal Pradesh: లోయలో పడిన టూరిస్టు బస్సు.. 8 మంది మృతి
Himachal Pradesh

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని సిర్మౌర్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 8 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కుప్వి నుంచి సిమ్లాకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.


పోలీసు వర్గాల సమాచారం ప్రకారం హరిపుర్దార్ ఏరియాలోని ఇరుకైన రహదారిపై వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు సిర్మూర్ ఎస్పీ నిశ్చింత్ సింగ్ నెగి తెలిపారు. తొలుత ప్రమాద స్థలికి చేరుకున్న స్థానికులు అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకోకముందే సహాయక చర్యలు చేపట్టారు. పలువురు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మరికొందరికి సీరియస్‌గా ఉండటంతో హెయర్ మెడికల్ సెంటర్లకు తరలిస్తున్నట్టు నిశ్చింత్ సింగ్ చెప్పారు.


కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ

సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2026 | 08:55 PM