Share News

దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:31 PM

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయంపై ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు.

దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్
Akash Chopra

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆయన కురిపించిన ప్రశంసలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయాన్ని ఏదో ప్రపంచ కప్ గెలిచినంత రేంజ్‌లో పొగుడుతూ పాక్ ప్రధాని అభాసుపాలయ్యారు. ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఈ విషయంపై స్పందించాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచులో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పీఎం షరీఫ్(Shehbaz Sharif) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమ్ పాకిస్థాన్‌కు అభినందనలు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి కృషి అమోఘం. దేశం గర్వించదగ్గ క్షణం ఇది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై ఆకాశ్ చోప్రా వెటకారంగా స్పందించాడు. ‘గౌరవంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇది ఆస్ట్రేలియా బి టీమ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే. ఆసీస్ జట్టులోని కీలక ప్లేయర్లు ఎవరూ ఈ జట్టులో లేరు. 170 పరుగుల మ్యాచులో కేవలం 20 పరుగుల తేడాతో గెలవడాన్ని ‘అద్భుతమైన ప్రదర్శన’ అని పిలవలేం’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.


అయితే కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లో.. అదీనూ కీలక ప్లేయర్లే లేని జట్టుతో గెలిచినందుకు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతలా స్పందించడంపై స్వయంగా పాక్ అభిమానులే విమర్శలు గుప్పిస్తున్నారు. నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ‘ప్రతిసారీ పరువు తీసుకోవడం ఆయనకు అలవాటు’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

ఐసీసీతో గూగుల్ ఒప్పందం

Updated Date - Jan 30 , 2026 | 05:31 PM