డబ్ల్యూపీఎల్ 2026: గుజరాత్ బ్యాటింగ్ పూర్తి.. ముంబై టార్గెట్ 168
ABN , Publish Date - Jan 30 , 2026 | 09:15 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్లు వడోదర వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్ బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్లు వడోదర వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్(Gujarat Giants) బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారు. ముంబైకి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ గార్డ్‌నర్(46), జార్జియా(44*) చెలరేగి ఆడారు.
బెత్ మూనీ(5) మరోసారి నిరాశ పర్చింది. సోఫీ డివైన్(25), అనుష్క శర్మ(33) పర్వాలేదనిపించారు. భర్తి ఫల్మలి(5*) నాటౌట్‌గా నిలిచింది. కెప్టెన్ గార్డ్‌నర్ తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ముంబై(Mumbai Indians ) బౌలర్లలో అమేలియా కెర్ 2, షబ్నిం ఇస్మాయిల్, నాట్ సీవర్ బ్రంట్ తలో వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్