వాళ్లది అర్థం లేని ప్రవర్తన.. పాక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:50 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే భారత్‌తో జరిగే మ్యాచులను పాక్ బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరో వారం రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే భారత్‌తో జరిగే మ్యాచులను పాక్ బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రాబోమని బంగ్లా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ(ICC) ఈ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.
అయితే బంగ్లాకు మద్దతుగా పాక్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటుందని పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై ఐసీసీ హెచ్చరికలు జారీ చేయడంతో పాక్ వెనక్కి తగ్గి తమ జట్టును ప్రకటించింది. అయినప్పటికీ ఈ టోర్నీలో ఆడాలా? వద్దా? అనే అంశంపై తమ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని నఖ్వి చెప్పుకొచ్చారు. కాగా ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) తీవ్రంగా స్పందించాడు. పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ఇది పూర్తిగా నాన్సెన్స్. మీరు ఇప్పటికే హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించి శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పుకున్నప్పుడు.. ఇప్పుడు ఈ హడావిడి ఎందుకు? ఇది అర్థం లేని ప్రవర్తన తప్ప మరేమీ కాదు’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కాగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్