Share News

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:48 PM

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్సీ విషయంలో అజేయంగా నిలుస్తున్నప్పటికీ.. సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకుని అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముందు స్కై ఫామ్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయమే. ఈ నేపథ్యంలో సూర్య కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫార్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)కు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డ్ ఉంది. టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా అతడికి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ మనం సూర్యకుమార్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అలాగే సూర్య బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.


‘సూర్యకుమార్ యాదవ్ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. కెప్టెన్‌గా అతడు కచ్చితంగా ప్రపంచ కప్ ఆడతాడు. కానీ బ్యాటర్‌గా సూర్య పరుగులు రాబట్టాల్సి ఉంది. అది అతడికి ఎంతో కీలకం’ అని ఇర్ఫాన్ విశ్లేషించాడు. కెప్టెన్‌గా సూర్య రికార్డు అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా 2025లో అతడు తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. 21 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టీ20 వరల్డ్‌ కప్‌ (ICC Mens T20 World Cup) 2026కు ముందు సూర్య తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో రెండు, మూడు టీ20ల్లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ 2026.. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్

దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్

Updated Date - Jan 31 , 2026 | 02:51 PM