Ind VS Pak: టాస్ గెలిచిన పాకిస్థాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:01 PM
అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సూపర్-6లో భాగంగా తలపడనున్నాయి. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో అపజయమే లేకుండా సాగిపోతున్న భారత జట్టు.. సూపర్-6లో భాగంగా కీలక పోరుకు సిద్ధమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇవాళ(ఫిబ్రవరి 1న) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా(ind vs pak) తలపడబోతోంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతుంది. ఇదే సమయంలో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌కు అవకాశముంటుంది. అయితే స్వల్ప తేడాతో ఓడితేనే అవకాశం ఉంటుంది. గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ సెమీస్ చేరాయి. గ్రూప్-2లో ఇంగ్లాండ్ బెర్తు ఖాయం చేసుకుంది. చివరి బెర్తు కోసం భారత్, పాక్ మధ్య పోటీ నెలకొంది. చివరగా పాక్‌తో తలపడినప్పుడు భారత్‌కు పరాభవం ఎదురైంది.
తుది జట్లు:
భారత్ అండర్-19:
ఆయుష్ మాత్రే(కెప్టెన్), ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ఎస్ అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్
పాకిస్థాన్ అండర్-19 :
ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హమ్జా జహూర్(వికెట్ కీపర్), సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్